‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ

-

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులకు నిరసన సెగ తప్పడం లేదు. ప్రజాప్రతినిధులు కనిపించగానే కొన్ని ప్రాంతాల ప్రజలు చొక్కా పట్టుకుని మరీ నిలదీస్తున్నారు. తమ కోసం పని చేస్తారని.. తమ అభివృద్ధికి సహకరిస్తారని ఓటు వేశామని.. కానీ ఇప్పుడు గొంతెత్తితో గొంతు కోసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలో ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన తెగ తగిలింది.

‘మీరు మా కొంపలు ముంచుతున్నారు.. మాట్లాడితే పోలీసు కేసులండి బాబూ.. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఉన్నాడంటూ బెదిరింపులు.. ఎన్నికల సమయంలో మీ కోసం పోరాడామండి.. నాడు జగన్‌కే ఓటేశాను.. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఎదుట దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరంటూ ఎమ్మెల్యే చిట్టిబాబు ఆ మహిళను ప్రశ్నించగా.. ‘వైసీపీ గ్రామ కమిటీ సభ్యులే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఎన్నో కేసులు పెడుతున్నారు.. మాట్లాడితే ఎస్సై వచ్చేస్తున్నారు.. మా అబ్బాయి ఏమీ చేయకపోయినా అత్యాచారం కేసు పెట్టారు. మీ వెనకాల ఉన్నవారే అక్రమ కేసులు పెట్టించారు. నా భర్త చనిపోయాడు.. నా అల్లుడు చనిపోయాడు.. చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. దేవుడు ఉన్నాడండి అన్నీ చూస్తున్నాడు’ అంటూ ఆ మహిళ ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు పట్టించుకోలేదని ఆమె నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news