జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67)కు అక్కడి సర్కార్ అధికార లాంఛనాలతో ఇవాళ తుది వీడ్కోలు పలికింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అబే జులై 8న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకు కుటుంబసభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన షింజో అబేకు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకడం ముమ్మాటికీ సబబు అన్నది ప్రధాని ఫుమియో కిషిద వాదన. ఈ క్రమంలోనే ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అబేకు అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియల రాజధాని నగరం టోక్యోలో భారీ ఏర్పాట్లు చేశారు. అబే అంత్యక్రియలకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. భారత్‌కు మంచి మిత్రుడిగా మెలిగిన అబేకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోకు వెళ్లారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా హాజరయ్యారు. షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమానికి ఏకంగా రూ.94.5 కోట్లు (11.6 మిలియన్ డాలర్లు) ఖర్చు పెడుతుండటం విమర్శలకు తావిస్తోంది.