కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్ర బాబు ఈరోజు సమావేశం అయ్యారు. ఇక ఈ సమావేశంలో విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు.
రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. యన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్‌కు అనుమతి లభించినట్లు వెల్లడించారు. వీటన్నింటిపై తగిన ఆదేశాలు త్వరలోనే ఇస్తామని చెప్పారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీతోపాటు ఆరుగురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిశారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అంశంపై మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ అంశాలను త్వరగా పూర్తిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్, పీయూష్ గోయల్, 16 ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియా, మనోహర్ లాల్ కట్టర్, హర్దీప్ సింగ్ పూరీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు.