తీవ్రమైన నేరారోపణలు, నేర చరిత్ర కలిగినన వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర న్యాయ, హోంశాఖలకు కూడా నోటీసులు పంపింది.
బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తీవ్రమైన క్రిమినల్ నేరాలు ఎదుర్కొంటున్న నేతలు పోటీలో పాల్గొనకుండా డిబార్ చేయాలని వ్యాజ్యంలో కోరారు. దీనిపై కేంద్రం, ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రిషికేశ్ రాయ్‌తో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే నోటీసులు పంపింది.