Breaking : బిగ్ బాస్ షోలో అంతా అశ్లీలతనే…హైకోర్టు సీరియస్

-

Breaking : బిగ్ బాస్ షో కు బిగ్‌ షాక్‌ తగిలింది. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని ఏపీ హై కోర్టులో పిటీషన్‌ దాఖలు అయింది. అయితే.. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా IBF గైడ్ లైన్స్ పాటించలేదని.. హై కోర్టు కు పిటిషన్ తరపున న్యాయవాది తెలిపారు. అశ్లీలత ఎక్కువగా ఉందని తెలిపారు పిటిషనర్ తరుపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి.

అయితే.. అశ్లీలత పై ఘాటుగా స్పందించిన న్యాయస్ధానం… 1970 లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని సీరియస్‌ అయింది. దీనిపై స్పందించేందుకు సమయం కోరారు కేంద్రం తరఫు న్యాయవాది. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదా లో నిర్ణయిస్తామని న్యాయస్ధానం పేర్కొంది. ఇక ఈ విచారణ అక్టోబరు 11కు వాయిదా వేసింది న్యాయస్ధానం.

Read more RELATED
Recommended to you

Latest news