కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

-

వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటుస్తున్న విషయం తెలిసిందే. తొలుత వరంగల్ కి బయలుదేరే ముందే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ పోస్టు చేశారు. తెలంగాణ చైతన్య రాజధాని, కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్ కు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతం. దోపిడికి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ మన భవిత కోసం వరంగల్ దశ, దిశ మార్చేందుకు వస్తున్నా అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటన జరుగుతోంది.  వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 4.25 ఎకరాల్లో రూ.95కోట్లతో కాళోజీ క్షేత్రం నిర్మించారు. కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడ కాళోజీ జీవిత విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వర్చువల్ గా ఎన్డీపీ స్టేషన్ ప్రారంభించారు. డిజిటల్ పద్దతిలో రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరా వక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.  మరోవైపు  వరంగల్ అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news