Kitchen: వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే పాటించాల్సిన పద్దతులు

-

ఆహారానికి అద్భుతమైన రుచిని అందించే వెల్లుల్లిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. దీన్ని సరిగ్గా నిల్వ చేసుకోకపోతే ఇది పాడైపోతుంది. వేడి, ఇంకా ఇతర కారణాల వల్ల వెల్లుల్లి పాడవుతుంది. అలాగే దానిలోని తేమ తొలగిపోయి ఎండిపోతుంది. తేమ తొలగిపోయిన వెల్లుల్లి.. ఆహారానికి కమ్మటి రుచిని అందివ్వలేదు. అందుకే దీన్ని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి.

సంవత్సరం మొత్తం అన్ని రోజుల్లో మార్కెట్ లో దొరికే వెల్లుల్లిని నిల్వ చేసుకోవడానికి కొన్ని టిప్స్ పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పేస్ట్ చేయండి:

వెల్లుల్లిని నిల్వ ఉంచడం కంటే.. వాటిని పేస్టు లాగా తయారు చేసి నిల్వ ఉంచుకోవడం మంచిది. అయితే పేస్టుని గాలికి పెట్టకుండా చల్లని ప్రదేశంలో, రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయడం ఉత్తమం.

జూట్ బ్యాగ్స్ వాడండి:

వెల్లుల్లిని జూట్ బ్యాగ్స్ లో నిల్వ చేయడం వల్ల గాలి ప్రవాహం సరిగ్గా జరిగి.. ఎక్కువ రోజులు వెల్లుల్లి పాడవకుండా తాజాగా ఉంటుంది.

గాలి చొరబడని డబ్బాలో నిల్వ:

వెల్లుల్లి పాయల పొట్టు తీసి ఒక డబ్బాలో నిల్వ ఉంచాలి. ఆ డబ్బాలోకి గాలి పోకుండా చూసుకోవాలి. డబ్బాను బయట పెట్టకుండా ఫ్రిడ్జ్ లోనే భద్రపర్చాలి. ఈ విధంగా చేస్తే వారం రోజుల పాటు వెల్లుల్లి తాజాగా ఉంటుంది.

కాటన్ బట్టలో నిల్వ:

కాటన బట్టలో వెల్లుల్లిని వేసి ముడి కట్టి.. తక్కువ వెలుతురు, తక్కువ వేడి గల ప్రదేశాల్లో ఉంచాలి. దీనివల్ల వెల్లుల్లి పాడవకుండా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news