BREAKING : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

-

తన సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. గాంధీనగర్ టు ముంబై మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 1 ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.


ఈ రైలు విశేషాల గురించి పశ్చిమ రైల్వే జోన్ సిపిఆర్ఓ సుమిత్ ఠాకూర్ వివరించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేక అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తుందని ఆయన వెల్లడించారు. ఇది ప్రయాణికులకు ప్రయాణ అనుభవం, అధునాతన అత్యాధునిక భద్రత ఫీచర్లు వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన రైలు ఢీకొనకుండా ఉండే వ్యవస్థ కవచ్ టెక్నాలజీ ఈ రైలులో ఉందని తెలిపారు.

రైలులో 160 కెఎంపిహెచ్ ఆపరేషనల్ స్పీడ్ కోసం పూర్తిగా సస్పెండ్ చేయబడిన ఫ్రాక్షన్ మోటార్లు కలిగిన బోగీలతో పాటు అధునాతన అత్యాధునిక సస్పెన్షన్ సిస్టంతో పాటు ప్రయాణికులకు సాఫీగా, సురక్షితమైన ప్రయాణాన్ని ఈ రైలు అందిస్తుందని ఆయన వెల్లడించారు. అన్ని తరగతులలో రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయని, అయితే ఎగ్జిక్యూటివ్ కోచ్ లలో 180 డిగ్రీల తిరిగే సీట్ల అదనపు ఫీచర్ ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news