తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు

-

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించింది ఇంటర్మీడియట్ బోర్డు. రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దసరా సెలవులు పాటించాలని.. తిరిగి ఈనెల 10వ తేదీన కాలేజీలు పున:ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కో-ఆపరేటివ్, గురుకుల జూనియర్ కాలేజీలు ఉత్తర్వుల మేరకు దసరా సెలవులు పాటించాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

అన్ని కాలేజీ యాజమాన్యాలు తిరిగి అక్టోబర్ 10న క్లాసులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాగా ఇప్పటికే స్కూల్లకు దసరా సెలవులు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news