వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడికి పోటెత్తిన భక్తులు

-

వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. ఈరోజు భద్రకాళి అమ్మవారు సరస్వతీ రూపంలో దర్శనమిస్తుండడంతో వరంగల్ తోపాటు వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. సర్వదర్శనంతో పాటు వీఐపీ, వివిఐపి, క్యూ లైన్ లన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి.

అయితే ఆదివారం భక్తుల సంఖ్య పెరుగుతుందని ముందస్తు సమాచారం ఉన్నా కూడా సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వి విఐపి, సేవల్లోనే అధికారులు, పూజారులు నిమగ్నమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రకాళి అమ్మవారి ఆలయంలో 21 మంది పూజారులు ఉన్నా.. సామాన్య భక్తులకు అమ్మవారి బొట్టు పెట్టే పూజారులు కూడా అందుబాటులో లేరనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

Read more RELATED
Recommended to you

Latest news