హైదరాబాద్ లో మహా నగరంలో మళ్లీ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం చేసే వ్యాపారవేత్త పై ఐటి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాదులో 8 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. తెల్లవారి జాము నుంచే సోదాలు చేస్తున్నాయి పది బృందాలు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, కూకట్ పల్లితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. సోదాల్లో 50 మంది అధికారులతో కూడిన 10 టీమ్స్…సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇక.. హైదరాబాద్ లో మహా నగరంలో జరిగే ఐటీ సోదాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు..
- జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, కూకట్ పల్లి తోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు..
- తెల్లవారుజామునే సోదాల కోసం బయల్దేరిన 10 టీమ్స్…
- సోదాల్లో 50 మంది అధికారులతో కూడిన 10 టీమ్స్…