విటమిన్ డి ఎక్కువైందని చెప్పే సంకేతాలు ఇవే..!

-

విటమిన్ డి లెవెల్స్ పెరిగితే జీర్ణాశయంలో ఇబ్బందులు వస్తాయి. తరచూ వికారం, వాంతులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలాగే విటమిన్ డి బాడీ లో ఎక్కువైనట్లయితే తినాలన్న కోరిక బాగా తగ్గిపోతుంది. దీంతో బరువు తగ్గిపోయి బలహీనంగా మారతారు. విటమిన్ డి లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కండరాలు బలహీనంగా మారిపోతాయి. ఎప్పుడు కూడా అలసటగానే ఉంటుంది. శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉన్నట్లయితే కాల్షియం స్థాయిలు పెరుగుతాయి దీంతో తరచూ మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. విటమిన్ డి పెరగడం వలన బాడీలో క్యాల్షియం స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

విటమిన్ డి లెవెల్స్ పెరిగినప్పుడు నాడీ సంబంధిత సమస్యలు కూడా కలుగుతాయి. దీంతో తికమక పడడం, ఫ్రస్ట్రేషన్ గా ఉండడం వంటి ఇబ్బందులు వస్తాయి. విటమిన్ డి ఎక్కువగా ఉంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అదుపు తప్పుతుంది. దీంతో బాడీ డిహైడ్రేషన్ కి గురవుతుంది. ఎక్కువగా దాహం వేస్తుంది. మంచినీళ్లు తాగుతూ ఉంటారు.

బాడీలో విటమిన్ డి లెవెల్స్ పెరిగితే కాల్షియం లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇలాంటి సమయంలో రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. ఎముకలు బలంగా మారాలంటే విటమిన్ డి, కాల్షియం చాలా ముఖ్యం. ఇవి శరీరంలో పెరిగితే ఎముకలు బలహీనమైపోతాయి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి విటమిన్ డి ఎక్కువగా ఉన్నట్లు వీటిని చూసి అర్థం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news