2022లో విడుదలయ్యే రోమాంటిక్ తెలుగు సినిమాలివే!

-

2022 స్టార్ట్ అయి అప్పుడే 9నెలలు పూర్తి అయింది. ఇంక 3 నెలలు మాత్రమే ఉంది. అయితే ఈ మూడు నెలల్లో సినీ ప్రేక్షకులను వస్తోన్న తెలుగు సినిమాలివే…

స్వాతి ముత్యం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లం కొండ గణేష్, వర్ష బొల్లమ్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మణ్ కె కృష్ణ వహించారు. నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు.

క్రేజీ ఫెలో మూవీ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది సాయి కుమార్, దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్, సప్తగిరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఫణి కృష్ణ అందించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాకు ధృవన్ సంగీతం అందించారు.

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వంత్, మాళవిక సతీషన్, మధు నందన్, సుదర్శన్, హర్ష వర్ధన్ నటిస్తున్నారు. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఊర్వశివో రాక్షసివో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాకేష్ శశి వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు.

ప్రిన్స్ మూవీ కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో శివకార్తికేయన్‏, ఉక్రెయిన్ బ్యూటీ మారియా కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రేమ్ జీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఖుషి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, సమంత తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ నిర్వాణ వహిస్తున్నారు. సంగీతం హేశం అద్బుల్ వాహద్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news