ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నేడు కార్యకర్తలతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నేడు మధ్యాహ్నం వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.
పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజీనామా నిర్ణయం ప్రకటన చేయనున్నారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. ఈ నెల 22న జన సేన పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. అటు తోట త్రిమూర్తులు కూడా జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట.