నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరుగనుంది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు.
ఈ తరునంలోనే.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు పిటీషన్ వేసిన కేసును జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ల ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. ఇక ఇటు నేటి నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. నేడు కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు రానున్నారు ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు. కమి షన్ బహిరంగ విచారణకు రానున్నారు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు.