ఖర్గే కామెంట్స్ పై థరూర్ కౌంటర్.. అధ్యక్ష ఎన్నిక అంతర్గత పోటీ కాదంటూ సెటైర్

-

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక బరిలో ఇద్దరు అభ్యర్థులే మిగిలారు. వారిలో ఒకరి మల్లికార్జున ఖర్గే.. మరొకరు శశి థరూర్. వీరిద్దరు తమదైన శైలిలో ప్రచారం షురూ చేశారు. ఈ క్రమంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలకు శశి థరూర్ కౌంటర్ ఇచ్చారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునేందుకు ఇదో అవకాశమన్నారు.

అధ్యక్ష ఎన్నిక ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించినా, థరూర్‌ మాత్రం పోటీనే కోరుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోటీ అవసరమని థరూర్‌ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. పార్టీ అధ్యక్షునిగా తాను ఎన్నికైతే గాంధీ కుటుంబంతో, ఇతర సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరిపి, వారు చెప్పిన మంచి విషయాలు ఆచరిస్తానని పేర్కొన్నారు. అలాగని తాను గాంధీ కుటుంబ మద్దతు ఉన్న అధికారిక అభ్యర్థిని కాదని స్పష్టంచేశారు.  భాజపాపై పోరాడడానికి నేతలంతా ఒక్కటై తనకు మద్దతు ఇస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

దీనిపై థరూర్ స్పందించారు.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది పార్టీలో అంతర్గతంగా జరిగే పోటీ కాదన్నారు. అయితే భాజపాపై ఎంతసమర్థవంతంగా పోటీ ఉండాలనేదానిని నిర్ణయించేందుకు ఈ ఎన్నిక ఓ అవకాశమన్నారు. ఖర్గేకు, తనకు మధ్య ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news