భారత్ లో కొత్తగా 2,529 కరోనా కేసులు

-

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1.22 లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,529 కొవిడ్‌ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.07 శాతం ఉన్నట్లు పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో 3,533 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 32,282 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 218.84 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు 94.88 కోట్ల మంది రెండో డోసు వేసుకోగా.. 21.47 కోట్ల మంది ప్రికాషన్‌ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త కేసులు 2,529 నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4.40 కోట్లు (98.74%) మంది కోలుకున్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 79,366 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 218.84 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news