ఏపీలో ఫిషరీస్ యూనివర్శిటీని అందుబాటులోకి తెస్తున్నామని.. ఈ నెల 28వ తేదీన ఫిషరీస్ యూనివర్శిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారని ప్రకటించారు మంత్రి సిదిరీ అప్పలరాజు. ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికి గ్రోత్ ఇంజన్ లాంటింది… దేశం మొత్తం మీద 70 శాతం ఆక్వా కల్చర్ ఏపీ నుంచే ఉంటోందని తెలిపారు. ఆక్వా రంగానికి జగన్ ప్రభుత్వం చేయూత ఇస్తోంది…ఆక్వా కల్చరులో సీడ్ టు సేల్ వరకు ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని వెల్లడించారు.
ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తోన్న ఏకైక రాష్ట్రమని.. ప్రస్తుతం 10 ఎకరాల్లోపు ఆక్వా సాగు చేసే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ. 1.50కే ఇస్తున్నామన్నారు. ఏపీ ఆక్వా సీడ్ యాక్ట్ తెచ్చామని.. ఆర్బీకే వంటి వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఆర్బీకేలోనూ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లని పెట్టామని.. నక్కపల్లి దగ్గర ఆక్వా కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఎక్కడికక్కడ ఆక్వా లాబులు ఏర్పాటు చేశామని.. ఆక్వా రంగంలో 11 శాతం గ్రోత్ నమోదు చేయగలిగామని స్పష్టం చేశారు మంత్రి సిదిరీ అప్పలరాజు.