టాలీవుడ్ లో అంబ‌టి రాయుడు బ‌యోపిక్ ?

-

చ‌రిత్ర ఓట‌మిని గుర్తు పెట్టుకుంటుందా? క‌చ్చితంగా గుర్తు పెట్టుకోదు. ఒక అద్భుతాన్ని చ‌రిత్ర గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ అద్భుత‌మే త‌ర్వాతి కాలంలో ఒక చ‌రిత్ర అవుతుంది కాబ‌ట్టి. అలా జీవితాంతం ప్ర‌య‌త్నిస్తూ ఓడిపోయి గెలిచిన అద్భుత‌మే ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు. మొద‌టిసారిగా ఈ పేరును ఓ వార్తా ఛాన‌ల్స్ లో విన్నాం. తెలుగు కుర్రాడు అద‌ర‌గొడుతున్నాడు. అంతా మ‌రో స‌చిన్ అన్నారు. నిజానికి స‌చిన్ క‌న్నా బాగా ఆడుతున్నాడ‌ని కితాబిచ్చిన వారూ ఉన్నారు. ఒక‌టి రెండేళ్ల‌లో ఇండియ‌న్ టీమ్ లో బెర్త్ ఖాయ‌మ‌న్నారు. కానీ ఆ వార్త వ‌చ్చిన‌ త‌ర్వాత రాయుడు మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. దేశ క్రికెట్ లో ఉన్న స్వార్ధ రాజ‌కీయాల‌కు ఘోరంగా దెబ్బ‌తిన్నాడు.

Sundeep Kishan In Ambati Rayudu Biopic

త‌న కొడుకు ఎదుగుద‌ల కోసం ప‌క్క‌వారిని తొక్కేయాల‌ని చూసిన ఓ తండ్రి స్వార్ధ బుద్దికి తిక్క రేగి ఎదురుతిరిగిన మొన‌గాడు. స‌వాల్ విసిరిన తెలుగు ముద్దుబిడ్డ‌. అంతే ఉడుకు ర‌క్తంతో ఏదో సాధించాలి అన్న యువ‌కుడి స్పీడ్ కి అక్క‌డే తొలిసారి బ్రేక్ ప‌డింది. రాయుడు తెలుగు వాడు. పైగా గుంటూరు కారం ముద్ద‌లు తిన్నోడు. దెబ్బ‌ల‌కి ఆగుతాడా? దెబ్బ కొట్టిన వారిని తొక్కిపారేయ‌కుండా ఉంటాడా? అలాగే చేసాడు. దెబ్బ‌తిన్న సింహంలా రంజీల్లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. మ‌ళ్లీ రాయుడు గురించి మీడియా లో ఓ రేంజ్ లో క‌థ‌నాలు అయితే ఈసారి తెలుగు మీడియాలో కాదు. దేశ‌మంతా చూసే జాతీయ స్థాయి ఛానెల్స్ లో . దీంతో ఒక్క‌సారిగా దేశ‌మంతా రాయుడి వైపు తిరిగి చూసిన క్ష‌ణాల‌వి. అంతా టీమ్ లో రాయుడికి చోటు ఖాయ‌మ‌నుకున్నారు. కానీ మ‌ళ్లీ మామూలే. రాయుడిని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు. మీడియా ష‌రా మామూలుగా మ‌ర్చిపోయింది. త‌న‌ని ప‌ట్టించుకోని వాళ్ల‌ని రాయుడు కూడా అస్స‌లు ప‌ట్టించుకోలేదు. అది పొగ‌రు కాదు రాయుడి ఆత్మాభిమానం.

అప్పుడే మొద‌లైన ఐసీఎల్ లో అడాడు. అక్క‌డా త‌న ట్యాలెంట్ చూపించాడు. అయితే అప్పుడే బీసీసీఐ అందులో ఆడిన వారికి ఐసీసీలో చోటు లేదని వెల్ల‌డించింది. దీంతో రాయుడి గుండె ప‌గిలిపోయింది. అనుకున్న‌ది సాధించ‌కుండానే నిష్క్రమించాల్సి  వ‌స్తుంద‌ని బాధ‌ప‌డ్డాడు. కానీ త‌ర్వాత బీసీసీఐ నిర్ణ‌యాన్ని మార్చుకుంది. దీంతో రాయుడు వెంట‌నే ఆ లీగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు. అయితే ఈసారి రాయుడు ఆడే రాష్ట్రం మారాడు. ఆట మార్చుకున్నాడు. కానీ త‌న వ్య‌క్తిత్వన్ని మాత్రం మార్చు కోలేదు. కాదు కాదు త‌న ఆత్మాభిమానాన్ని త‌ప్ప‌. ప‌లితం మ‌ళ్లీ మామూలే. అయినా రాయుడు త‌న పోరాటాన్ని ఆప‌లేదు. అదే స‌మ‌యంలో ఐపీఎల్ వ‌చ్చింది. దీంతో ఐపీఎల్ కు ఎంపిక‌య్యాడు. ఇక్క‌డే రాయుడికి అస‌లు ప‌రీక్ష మొద‌లైంది. మొద‌టి వ‌న్డే లో 50, త‌ర్వాత సెంచ‌రీ కానీ ఇండియా టీమ్ లో ప్లేస్ లేదు.

బాగా ఆడినా ఆడ‌క‌పోయినా రాయుడికి బీసీసీ ఐ చోటు క‌ల్పించ‌లేదు. కానీ 12 ఏళ్ల‌లోనే ఎన్నో రాజకీయాలు చూసిన రాయుడికి ఆవేమి క‌ష్టం అనిపించ‌లేదు. చివ‌రిగా ఇండియా టీమ్ లో నాల్గ‌వ స్థానం ఖాళీ అవ్వ‌డంతో రాయుడు పోటీ ప‌డి గెలిచాడు. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ విష‌యంలో రాయుడు ప‌ట్ల బీసీసీఐ ఎలాంటి ధోర‌ణి అవ‌లంచించిందో తెలిసిందే. రాయుడి ఎంపిక చేయ‌క‌పోవ‌డం వెనుక త‌న జిల్లాకు చెందిన ఎమ్ ఎస్ కె ప్ర‌సాద్ అడ్డుత‌గిలాడ‌ని, ఇది కుల పిచ్చితో చేసిన ప‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇలా రాయుడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.

ఇప్పుడిదే క‌థ‌ను తెర‌కెక్కిస్తే ఓ అద్భుతం అవుతుందని టాలీవుడ్ మేక్సర్స్ భావిస్తున్నారుట‌. సందీప్ కిష‌న్ అత‌ని బ‌యోపిక్ లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. రాయుడు ఒకే అంటే సందీప్ కిషన్ హుటాహుటిన ఆ ప‌నుల్లో బిజీ అవుతాన‌ని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news