యూపీఐ ఐడీని మీ గూగుల్ పే లో మార్చాలా..? అయితే ఇలా సులభంగా మార్చచ్చు..!

-

ఈ మధ్య ఆన్ లైన్ పేమెంట్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది క్యాష్ పేమెంట్స్ కాదని ఆన్ లైన్ పేమెంట్స్ ని ఎక్కువ చేస్తున్నారు. అయితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వచ్చిన తర్వాత డబ్బులు పంపడం మరెంత సులభంగా మారింది.

గూగుల్ పే ని యుపిఐ పేమెంట్స్ కోసం ఎక్కువగా వాడుతున్నారు. గూగుల్ పేలో యూపీఐ ఐడీ ఎలా మార్చచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐడీని క్రియేట్ చేయడం చాలా ఈజీ. మీరు గూగుల్ పే యాప్ ని ఇన్‌స్టాల్ చేసి రిజిస్టర్ అయినప్పుడే యూపీఐ ఐడీ జనరేట్ అవుతుంది. దాన్ని ఎలా మార్చాలి అనే విషయానికి వస్తే…

ఫస్ట్ గూగుల్ పే యాప్ ని ఓపెన్ చేయండి.
ఇప్పుడు టాప్ రైట్‌లో ప్రొఫైల్ పిక్చర్ పైన నొక్కండి.
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి.
మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ వస్తుంది.
ఇప్పుడు మీరు ఏ అకౌంట్‌కు యూపీఐ ఐడీ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ఎంపిక చేయండి.
డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మేనేజ్ యూపీఐ ఐడీస్ పైన క్లిక్ చేయండి.
అకౌంట్‌కు క్రియేట్ అయిన యూపీఐ ఐడీలు వస్తాయి.
కావాలంటే డిలిట్ చేయొచ్చు.
లేదంటే + పైన క్లిక్ చేసి యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు అంతే.
యూపీఐ ని ఉపయోగించడం ఈజీ. పైగా మనం సులువుగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చెయ్యచ్చు. యూపీఐ, రూపే కార్డుల ద్వారా విదేశాల్లో కూడా పేమెంట్స్ చేసుకునే అవకాశం వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news