బ్రహ్మాస్త్ర, స్వాతిముత్యం OTT డేట్స్ ఫిక్స్

-

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం. ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మింఛారు.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిచింది. ఈ సినిమా దసరా నాడు రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ స్వాతిముత్యం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈనెల 28వ తేదీన ఈ సినిమాను ఆహా లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అలాగే బ్రహ్మాస్త్ర సినిమా నవంబర్ 4వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news