రోహిత్ శర్మ సారథ్యంలోని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ పలు సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో భారత జట్టుకు కూడా రోహిత్ అయితేనే కెప్టెన్‌గా సరిపోతాడని, కనుక ఆ బాధ్యతను రోహిత్ శర్మకే అప్పగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న భారత్ వెస్టిండీస్ టూర్ కు గాను ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం విదితమే. విండీస్‌తో జరగనున్న 3 టీ20, వన్డేలు, 2 టెస్టులకు గాను భిన్నమైన జట్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్యానెల్ విండీస్ టూర్‌కు వెళ్లబోయే భారత జట్టు ఆటగాళ్ల వివరాలను తెలియజేసింది. అయితే అన్ని ఫార్మాట్లకు భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లిని నియమించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇటీవల జరిగిన వరల్డ్ కప్ టోర్నీలలో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు టోర్నీలను అనవసరంగా కోల్పోయిందని, ఇక కోహ్లి నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో దారుణ ఓటమి పాలైందని.. కనుక పెద్ద టోర్నీలకు కోహ్లి సరిగ్గా నాయకత్వం వహించలేకపోతున్నందున అతని స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ పలు సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో భారత జట్టుకు కూడా రోహిత్ అయితేనే కెప్టెన్‌గా సరిపోతాడని, కనుక ఆ బాధ్యతను రోహిత్ శర్మకే అప్పగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో కోహ్లిపై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి బీసీసీఐ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..!