ఎంత డబ్బు పంచినా… మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు విజయశాంతి. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. వారు విచ్చలవిడిగా డబ్బు పంచుతూ… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నరు, వీరికి పోలీసులు కూడా వంతపాడుతున్నారని ఫైర్ అయ్యారు.
మునుగోడు నియోజకవర్గంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో కేవలం ప్రతిపక్షనాయకులను మాత్రమే పోలీసులు టార్గెట్ చేస్తున్నరు. బీజేపీ పార్టీ లీడర్ల వాహనాలపైనే నిఘా పెడుతున్నరు. అధికార పార్టీ నుంచి 15 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడులో తిష్టవేసి ప్రచారం పేరుతో నిత్యం మందు, విందు, జన సమీకరణ అంటూ కోట్లు కుమ్మరిస్తున్నా… స్వయంగా మంత్రులే కుల సంఘాలకు బహిరంగంగా లక్షలకు లక్షలు పంచుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు.
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఖర్చుపెడుతున్న కోట్లాది రూపాయలు మునుగోడులోకి ఏ రూట్లలో, ఏ కార్లలో వస్తున్నాయో ఒక కన్ను వేసి, వాటిని చెక్పోస్టుల్లో ఎందుకు పట్టుకోవడం లేదు? ఇదంతా కావాలనే చేస్తున్నరు. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా… బిజెపి విజయం ఖాయం అని పేర్కన్నారు రాములమ్మ.