తెలంగాణలో లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. తెలంగాణలోని లైంగిక నేరాల్లో నిందితులుగా ఉన్న వారితో అమెరికా తరహాలో జాబితా తయారు చేయాలని కోరారు. ఆ జాబితా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
రిక్రూట్మెంట్ ప్రక్రియలో సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్ పనిచేస్తుందని సునితా కృష్ణన్ అభిప్రాయపడ్డారు. నేరస్థుల జాబితాను తయారు చేసేందుకు తన వద్ద ఒక కాన్సెప్ట్ ఉందని తెలిపారు. సుమారు 20 దేశాల్లో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా ఆ విధానాన్ని రూపొందించామని చెప్పారు. ఆ కాన్సెప్ట్ ను ప్రజెంట్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సునీతా కృష్ణన్ తన ట్వీట్లో తెలిపారు.
మంత్రి కేటీఆర్ సునీతా కృష్ణన్ ట్వీట్ కు స్పందించారు. లైంగిక నేరస్థుల జాబితాను కచ్చితంగా తయారు చేద్దామని అన్నారు. అయితే దానికి సంబంధించిన కాన్సెప్ట్‌ను ప్రభుత్వానికి ప్రజెంట్ చేయాలని కోరారు. ఆ కాన్సెప్ట్‌ను తాము కచ్చితంగా ముందుకు తీసుకువెళ్తామని కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
Let’s absolutely get it done. Please present the concept note and we will take it forward https://t.co/upfIM1Au0W
— KTR (@KTRTRS) October 20, 2022