పోలీస్ శాఖలో ఖాళీలను తర్వలోనే భర్తీ చేస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. పాల్గొన్న హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలోని 6 వేల పై చిలుకు పోస్టులను అతి త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు సీఎం జగన్.
దిశా చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని… సామాన్యులు పోలీస్ స్టేషనుకు రాకుండానే కేసు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ మిత్ర వంటి వాటి ద్వారా సైబర్ నేరాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. నేరాల నియంత్రణకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉపకరిస్తోందని.. గ్రామ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ స్థాయిలోనే సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం జగన్.