పెట్రోల్ ధరలు పెంచిన సన్నాసే తగ్గించాలి : కేటీఆర్

-

ముడి చమురు ధర పెరగలేదని.. కానీ దేశంలో పెట్రో ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు. కేంద్రమే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ విధించి రూ.30 లక్షల కోట్లు తీసుకుందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు.

“పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ఒక ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ను ఓ జర్నలిస్టు అడిగారు. పెంచిన సన్నాసే తగ్గించాలని కేసీఆర్ చెప్పారు. దోచుకున్నది చాలు.. ఇకనైనా సెస్సులు రద్దు చేసి లీటర్‌ పెట్రోల్‌ను రూ. 70కి, లీటర్‌ డీజిల్‌ను రూ. 65కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రూడాయిల్ ధరలు మారలేదు. కానీ అడిషనల్ డ్యూటీలు, సెస్సులు వేసి సామాన్యుడి నడ్డీ విరగ్గొడుతున్నారు.” అని మోదీపై కేటీఆర్ మండిపడ్డారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు అన్నిరేట్లు పెరుగుతాయని.. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కేటీఆర్ అన్నారు. మాటలు పెద్దవి పెద్దవి మాట్లాడారని.. కానీ చేసిందేమీ లేదని తెలిపారు. ఒక్కడు ధనవంతుడైతే నల్లగొండ రూపు రేఖలు మారుతాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సిలిండర్ ధర ఒకప్పుడు రూ. 400 ఇవాళ మాత్రం రూ. 1200లకు పెరిగిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news