ఇతరులకు సహాయం చేయడానికి మన దగ్గర మంచి మనసు ఉంటే సరిపోతుంది. మన దగ్గర ఏమీ ఉండాల్సిన పనిలేదు. చాలామంది ఇతరులకు సహాయం చేయాలంటే డబ్బు ఉండాలి బంగారం ఉండాలి లేదంటే ఆహారం ఉండాలి ఏదైనా విలువైనవి ఉండాలి అని అనుకుంటారు. అలానే ఉద్యోగం చేసి మంచిగా డబ్బులు సంపాదించే వాళ్లు మాత్రమే ఇతరులకు సహాయం చేయగలరు అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇవేమీ అవసరంలేదు సహాయం చేయాలంటే ఒక మాట కూడా సహాయం చేస్తుంది.
ఎదుటి వాళ్ళకి మనం మాటల ద్వారా కూడా సహాయం చేయొచ్చు పైగా మాట్లాడటం నాకు చేత కాదు కదా నేను ఎలా మాట్లాడుతాను..? ఎలా మాట సహాయం చేస్తాను అని మీరు అనుకోకండి. మాట సహాయం అంటే మీరేం ఉపన్యాసాలు ఇచ్చేక్కర్లేదు. ”నీవు చేయగలవు”, ”నువ్వు గెలుస్తావు”, ” నీ మీద నాకు నమ్మకం ఉంది” ఇలాంటి చిన్న చిన్న మాటలు కూడా సరిపోతాయి.
ఇలాంటి మాటల వల్ల వాళ్ళకి ప్రయత్నం చేస్తే చాలు ధైర్యం వస్తుంది. పాజిటివ్ గా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మాటల ద్వారా కూడా మీరు చిన్న సహాయం చేయండి. దీనితో ఇతరులు ముందుకు వెళ్తారు. అలానే ఒక్క మాట చాలు వారిలో వుండే కాన్ఫిడెన్స్ ని తగ్గించేదానికి.
నీకు రాదు, నీవల్ల అవ్వదు ఇలాంటివి అనకండి. నిజానికి నోరు జారితే మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఎప్పుడైనా సరే వీలైతే ప్రోత్సహించండి. అంతే కానీ ఎదుటి వాళ్ళని ఎవర్నీ కూడా నిరుత్సాహపరుచకండి ఇలా కనుక మీరు నడుచుకుంటే చక్కగా ఇతరులు ఆనందంగా వుంటారు. ఇతరులు ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఇలా చిన్న సహాయం చేసినా సరిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి చిన్న చిన్న సహాయాలు అయినా అందించండి. నా దగ్గర ఏమీ లేదు కదా నేను ఇతరులకు ఏం చేస్తాను అని మాత్రం అనుకోవద్దు.