అల్లు శిరీష్ సినిమా ప్రమోషన్ యూత్ టార్గెట్ గా.!

-

అల్లు శిరీష్  హీరోగా `అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన సినిమా ఊర్వశీవో రాక్షసివో. శశి ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అంతే కాకుండా అల్లు శిరీష్ అను ఇమ్మాన్యుయేల్ ల మధ్య  టీజర్ లో మంచి హగ్ మరియు లిప్ లాక్ సన్నివేశాలు ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దీంతో యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. దాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు సినిమా యూనిట్. నవంబర్ 4న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఇప్పటికే మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు శిరీష్ పాల్గొన్నాడు. అనంతరం కనక దుర్గమ్మను దర్శించుకుని సినిమా హిట్ కావాలని కోరుకున్నాడు.

అలాగే దగ్గర లోని కాలేజ్ యూత్ దగ్గరకు వెళ్ళి వారిని ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత విజయవాడ పట్టణంలోని ‘ఎస్ఎస్ఎస్’ ఇడ్లీ సెంటర్ కు వెళ్లి టిఫిన్ చేశాడు. ఈ టిఫిన్ సెంటర్లో పలువురుతో సెల్పీ లు దిగుతూ హల్చల్ చేశాడు. అలాగే అక్కడకి వచ్చిన యూత్ తో ముచ్చట్లు పెట్టాడు. ఇంకా  యూత్ టార్గెట్ చేస్తూ చాలా కాలేజీలు కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది చూస్తూంటే సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని తాపత్రయ పడుతున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news