‘కాంతార’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

-

సైలెంట్ గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ సినిమా ‘కాంతార’కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓ రేంజిలో వసూళ్లు రాబడుతోంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించి ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.

తాజాగా ‘కాంతారా’ సినిమా చూస్తూ ఓ కన్నడ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల రాజశేఖర్ అనే వ్యక్తి ఈ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే థియేటర్ యాజమాన్యం స్పందించి అతడిని హాస్పిటల్ కు తరలించింది. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే రాజశేఖర్ చనిపోయాడని తెలిపారు.

ఈ ఘటన కన్నడ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే, ఆ సినిమాకు అంత పాజిటివ్ టాక్ వస్తోంది. చనిపోయిన వ్యక్తి ఆ సన్నివేశాలను చూస్తూ చనిపోయాడా? లేదా ఇదివరకే అతడికి గుండె సమస్యలు ఉన్నాయా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news