ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. హెచ్ డీ కుమారస్వామి రియాక్షన్ ఏంటంటే..?

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌ లోటస్‌పై ప్రధాని మోదీ స్పందించాలని కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్‌ చేశారు. తెలంగాణలో బీజేపీ.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేయడం తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. పాపపు సొమ్ముతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చారని, అదే పాపపు సొమ్ముతో వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోశారని, ఇప్పుడు తెలంగాణలో వారి ప్రయత్నం బెడిసి కొట్టిందని అన్నారు.

బీజేపీ అసలు రంగు మరోసారి బహిర్గతమైందని కుమారస్వామి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అక్రమార్జనతో కుప్పకూల్చటం అసాధ్యమన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ కుట్రపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని, ఈడీ బదులిచ్చి తీరాలని, తప్పించుకోవటం కుదరదని పేర్కొన్నారు. బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. తప్పు దారిలో పయనిస్తున్న బీజేపీ ఎప్పటికైనా ఎదురుదెబ్బ తప్పదని కుమారస్వామి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news