BREAKING : ఆద్యంతం ఆసక్తిరేపుతున్న సమంత యశోద ట్రైలర్‌..

-

సమంత నటించిన ‘యశోద’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఇటీవల విడుదలైన టీజర్‌లో ప్రగ్నెంట్ ఉమెన్‌గా కనిపించిన సమంత.. థ్రిలింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సవాళ్లని ఎదురీదుతూ కనిపించింది. దాంతో ఇప్పటికే ఈ యశోద సినిమాపై అంచనాలు పెరిగిపోగా.. గురువారం ఐదుగురు స్టార్ హీరోలు యశోద ట్రైలర్ ని లాంచ్‌‌ని చేశారు. దీంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. నవంబరు 11న థియేటర్లలోకి యశోద రాబోతోంది. తెలుగులో ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ రిలీజ్‌ చేశారు. అయితే.. ఈ ట్రైలర్‌లో ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. ఈ ట్రైలర్‌లో సమంత ఫైటింగ్‌ సీన్స్‌కు ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. గర్భవతిగా ఉన్న సమంత ఫైటింగ్‌ సీన్స్‌ ఈ సినిమాకు హైలట్‌ నిలువనున్నట్లు కనిపిస్తోంది.

Samantha Yashoda Trailer Review | cinejosh.com

అయితే.. ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్‌ సిరీస్‌లో నటించిన సమంత దేశవ్యాప్తంగా క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. దాంతో యశోద మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. హరీ, హరీష ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news