మెగా మేన‌ల్లుడికి మ‌ధ్య‌లో నో చెప్పిన స్టార్!

-

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్మ‌డు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన‌తో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మేన‌ల్లుడి స‌క్సెస్ కోసం చిరంజీవి ప్రత్యేకంగా శ్ర‌ద్ద తీసుకుంటారు. అందుకే సుకుమార్ శిష్య‌డు బుచ్చి రాజు చేతుల్లో పెట్టారు. బుచ్చి రాజు డైరెక్ట‌ర్ అయినా వెనుకుండి క‌థ న‌డిపించేది అంతా సుకుమారే. ఈ సినిమాకి త‌నే క‌థ‌, క‌థ‌నాన్ని అందించాడు. ప్ర‌స్తుతం సుకుమార్ ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. త‌న సొంత సినిమాను సైతం ప‌క్క‌న‌బెట్టాడంటే వైష్ణ‌వ్ పై ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్ధ‌మ‌వుతోంది. న‌టీన‌టుల‌ను కూడా చాలా ప‌కడ్బందీగా ఎంపిక చేసారు.

Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena
Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena

ఈ నేప‌థ్యంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కోసం త‌మిళ్ నుంచి విజ‌య్ సేతుప‌తికి భారీ పారితోషికం ఇచ్చి మ‌రీ రంగంలోకి దింపారు. అంత‌టి స్టార్ రంగంలోకి దిగ‌డంతో సినిమా అమాంతం పైకి లేచింది. తాజాగా ఉప్పెన టీమ్ కి సేతుప‌తి పెద్ద షాక్ ఇచ్చాడ‌ని స‌మాచారం. సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ని ఆయ‌న అత్యంత సన్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగిచ్చేసాడుట‌. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ పై స‌న్నివేశాలు చిత్రీక‌రించారా? లేదా? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంట‌నేవి ఇంకా తెలియ‌లేదు. ఇదే గ‌నుక నిజ‌మైతే సినిమా కు మీడియాలో బ‌జ్ ప‌డిపోతుంది. విజ‌య్ సేతుప‌తి ఉన్నాడ‌నే కార‌ణంగా ఇన్నాళ్లు సినిమాకు ఓ హైప్ తీసుకొచ్చారు. లేదంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎంట్రీలా ష‌రా మామూలుగా తేలిపోయేద్ది. అయితే ఉప్పెన విజ‌య్ సేతుప‌తి రేంజ్ సినిమా కాద‌ని టాలీవుడ్ మీడియాలో మొద‌టి నుంచి ప్ర‌చారం ఉంది. పాత్ర‌కు జీవం పోసే న‌టుడు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల‌డు. అంత‌టి పేరున్న స్టార్ డెబ్యూ వైష్ణ్ తేజ్ సినిమాలో న‌టించ‌డం ఏంటి? అనే చిన్న కంగారు అభిమానుల్లో ఉండేది. మ‌రీ కార‌ణానికి! విజ‌య్ త‌ప్పుకోవ‌డానికి ఏదైనా సంబంధం ఉందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news