మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటిల్లోనూ అనేక జాతులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని జీవాలు శాకాహారులుగా ఉంటే.. మరికొన్ని జీవులు మాంసాహారులుగా ఉన్నాయి.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటిల్లోనూ అనేక జాతులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని జీవాలు శాకాహారులుగా ఉంటే.. మరికొన్ని జీవులు మాంసాహారులుగా ఉన్నాయి. అయితే మాంసాహారుల విషయానికి వస్తే కొన్ని జంతువులు ఇతర జంతువులను వేటాడి చంపి తింటే.. మరికొన్ని జీవులు ఇతర జంతువులను మింగేస్తాయి. అది కూడా మనకు భయం గొలిపే విధంగా ఆ పనిచేస్తాయి. కింద ఇచ్చిన వీడియో అదే..
కొమొడో ద్వీపంలో పెద్దసంఖ్యలో ఉంటాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ‘డ్రాగన్ మానిటర్’ అని కూడా దీని్న పిలుస్తారు. నిజానికి ఇది బల్లి జాతికి చెందిన సరీసృపం. మొసలిలా ఇది కూడా దాదాపు పది పదిహేను అడుగుల దాకా పెరుగుతుంది. ఇది విషపు జీవి కూడా. చంపేంత విషముండదు కానీ, దాదాపు అంత పనీ చేస్తుంది. చూడ్డానికి భయం కంటే జలదరింపే ఎక్కువగా ఉంటుంది. మనుషులను చంపినట్లుగా ఇప్పటివరకు ఎటువంటి దాఖలాలైతే లేవు.
వీడియో చూశారు కదా.. అందులో ఓ కొమొడో డ్రాగన్ ఒక కోతిని అమాంతం మింగేసింది. నిజానికి ఈ జీవులు తమకన్నా రెండు రెట్ల ఎక్కువ సైజ్ ఉన్న జంతువులను కూడా అమాంతం మింగేస్తాయట. ఈ కొమొడో డ్రాగన్లు ఇండోనేషియా దేశంలోని ద్వీపాల్లో ఎక్కువగా ఉంటాయి.
ఈ క్రమంలోనే ఇండోనేషియాలో ఓ కొమొడో డ్రాగన్ ఆ కోతిని మింగుతున్న వీడియోను ఎవరో తీసి దాన్ని సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేశారు. ఇంకేముందీ.. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ఏది ఏమైనా.. ఆ డ్రాగన్ కోతిని మింగుతున్న వీడియో చాలా భయంగొలుపుతుంది కదా..!