టాలీవుడ్ అలనాటి హీరోయిన్ రంభకు పెను ప్రమాదమే తప్పింది.రంభకు, ఆమె ఫ్యామిలీకి ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో రంభ ఫ్యామిలీ కి గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీకి అందరికీ గాయాలయ్యాయని రంభ వాపోయింది. అయితే అవన్నీ చిన్న గాయాలేనని, కానీ తన కూతురు సాష మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉందని చెబుతూ ఎమోషనల్ అయింది.
ఈ మేరకు రంభ చేసిన పోస్ట్ మీద అందరూ స్పందిస్తున్నారు. స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా, ఇంకోకారు అనుకోకుండా తమ కారును ఢీ కొట్టిందని, ఈ ప్రమాదంలో అందరికీ చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కానీ నా కూతురు సాష మాత్రం ఇంకా హాస్పిటల్ లోనే ఉంది. తను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి. మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్, ఈ సమయంలో మీ ప్రార్థనలో మాకు ఎంతో ముఖ్యమైనవి అంటూ రంభ వేడుకుంది.
Ouw car was hit by another car at an intersection wayback from picking kids from school! "Me with kids and my nanny" All of us are safe with minor injuries 😔my little Sasha is still in the hospital 😞 bad days bad time 😪😰please pray for us 🙏 your prayers means a lot 🙏🙏 pic.twitter.com/BqgrNjfdpi
— Rambha Indrakumar (@Rambha_indran) November 1, 2022