Samnatha: శాకుంతలం సినిమా బడ్జెట్ ఎన్ని కొట్లో తెలుసా..?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తూ ఉండగా దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళం నటుడు దేవ్ మోహన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా నవంబర్ నెలలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. వాటి గురించి తెలుసుకుందాం.

శాకుంతలం సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మొదట ఈ సినిమాకి రూ.50 కోట్ల రూపాయల దాకా బడ్జెట్ అనుకోగా ప్రస్తుతం ఈ సినిమాకి రూ.65 కోట్ల రూపాయలు అటు ఇటుగా పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దీంతో దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టేశారని చెప్పవచ్చు. సమంత ఇమేజ్ మీద కేవలం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఇది చాలా రిస్క్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంతటి కలెక్షన్లు సాధించడం అంటే అది మరింత కష్టమని పలువురు నెటిజన్లో సైతం తెలియజేస్తున్నారు.

సమంత ఇమేజ్కు గుణశేఖర్ టాలెంట్ ఈ సినిమా కలిసి వస్తే ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని సమంత అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక గతంలో అనుష్కతో కలిసి రుద్రమదేవి సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు గుణశేఖర్. శాకుంతలం సినిమాల సమంత పాత్ర అందరిని మెస్మరైజ్ చేసి కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుందేమో చూడాలి. సమంత కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news