మునుగోడు ‘ఫైనల్’..ఎడ్జ్‌లో ఆ పార్టీ?

-

మునుగోడు ఉపఎన్నిక చివరి ఘట్టానికి వచ్చింది…నవంబర్ 1తో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది..మరో రెండు రోజుల్లో అంటే 3వ తేదీన ఎన్నికల పోరు జరగనుంది. 6వ తేదీన ఫలితం వస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. ఆఖరికి కొట్టుకునే వరకు కార్యకర్తలు వెళ్ళిపోయారు.

ఇక ఇతర పార్టీ నేతలని కొనుగోలు చేయడం, ఓటర్లకు నగదు, బంగారం, చీరలు..ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల తాయిలాలు అందించారు. మందు, విందు అన్నట్లు ఈ కొన్ని రోజులు మునుగోడులో ఓ జాతర వాతావరణం నడిచింది. ఇప్పటివరకు ఒక ఎత్తు…ఎన్నిక సమయం వరకు ఒక ఎత్తు అనేది చెప్పొచ్చు. ఈ రెండు రోజులు..పార్టీలు ఓటర్లకు ఏ స్థాయిలో డబ్బు పంపిణీ చేస్తారో ఊహించలేం. మూడు ప్రధాన పార్టీలు ఓటర్లని ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నాయి. అయితే అధికార బలం, కమ్యూనిస్టుల మద్ధతు ఉన్న టీఆర్ఎస్ పార్టీకే ఇక్కడ ఎడ్జ్ ఉందని దాదాపు అన్నీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి గాని..ఆ గెలుపు భారీగా ఉండదని అంటున్నారు. తక్కువ మెజారిటీతోనే గెలిచే ఛాన్స్ ఉందని సర్వేల్లో తేలుతుంది. ఇక సెకండ్ ప్లేస్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని సర్వేల్లో తేలింది. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో ఉండగా, కొన్ని సర్వేల్లో బీజేపీకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు.

అయితే అనుకున్న విధంగా కాంగ్రెస్ ఓట్లు…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పడవని సర్వేల్లో తేలింది. అందుకే కోమటిరెడ్డికి కాస్త రిస్క్ ఎక్కువ ఉంది. ఇక సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ అయిన, బీజేపీ అయిన రావోచ్చు..ఎవరు సెకండ్ ప్లేస్‌లో ఉన్నా సరే..కాంగ్రెస్-బీజేపీల మధ్య ఓ నాలుగైదు వేల ఓట్లే తేడా ఉంటుందట. మొదటి ప్లేస్ టీఆర్ఎస్‌కే అంటున్నారు. మరి చూడాలి ఎన్నికకు ఇంకా రెండు రోజులు సమయం ఉంది..ఈలోపు ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో..మునుగోడు ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news