టీఆర్ఎస్ పై బీజేపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. సీఈసీకి ఫిర్యాదు

-

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగియనున్న సమయంలో టీఆర్‌ఎస్‌పై బీజేపీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీఆర్ఎస్‌.. బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మునుగోడులో ఓటమి తప్పదని అర్థమైన గులాబీ పార్టీ తమ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిపై అక్రమ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు.

మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఈసీని కలిశారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీని, తమ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్​రెడ్డిని బద్నాం చేసే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించినట్లు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్​ను కలిసిన బీజేపీ బృందం.. టీఆర్‌ఎస్‌ పార్టీ.. రాజగోపాల్​రెడ్డిపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న ఖాతాలకు సుశీ ఇన్​ఫ్రా నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news