కేటీఆర్ ట్వీట్ కి రేవంత్ రెడ్డి కౌంటర్..

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఆక్షేపించారు.

రాహుల్ గాంధీకి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ కనీసం తన సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేకపోయారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌పై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రధాని కావాలనుకునే వారు ముందు ఎంపీ అయ్యేలా తన ప్రజల్లో నమ్మకం కల్గించుకోవాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించారు.

అయితే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కి టి.పి.సి.సి చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. “కన్న కూతురినే ఎంపీగా గెలిపించుకోలేని మీరు, డబ్బా కొట్టుకున్న జాతీయ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది అన్న సంగతి గుర్తుందా..!? ఎవరన్నా గుర్తు చేయండి రా బాబూ..!?” అని రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news