ఆ నిర్ణయంపై రిషి సునాక్‌ యూటర్న్‌.. అందుకేనా..!

-

బ్రిటన్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మొన్నటిదాకా హోం మంత్రి నియామకంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రిషి.. నిన్నటికి నిన్న వాతావరణ సదస్సుకు హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంపై దేశంలోనే గాక, ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో రిషి సునాక్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ సదస్సుకు హాజరవుతానంటూ తాజాగా ట్వీట్‌ చేశారు.

‘‘వాతావరణ మార్పులపై  నియంత్రణ చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాల శ్రేయస్సు సాధ్యం కాదు. పునరుత్పాదక వనరులకు ఖర్చు చేయకపోతే ఇంధన భద్రత ఉండదు. అందుకే వచ్చేవారం జరగబోయే 27వ వాతావరణ సదస్సుకు నేను హాజరవుతాను. గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగిస్తూ సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తు నిర్మాణంపై ప్రసంగిస్తాను’’ – రిషి సునాక్‌

https://twitter.com/RishiSunak/status/1587746521457500160

ఈజిప్టు వేదికగా నవంబరు 6 నుంచి 18 వరకు వాతావరణ సదస్సు జరగనుంది. అయితే ఈ సదస్సుకు ప్రధాని సునాక్‌ హాజరయ్యే అవకాశం లేదని డౌనింగ్‌ స్ట్రీట్‌ గతవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూకేలో ముందస్తుగా నిర్ణయించిన పలు సమావేశాలు, కార్యక్రమాల నేపథ్యంలో ఆయన ఈ సదస్సుకు హాజరకాకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సునాక్‌పై విమర్శలు వచ్చాయి. ఈ సదస్సుకు యూకే మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రిషి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news