మీ ఆధార్ కార్డుని లాక్ చెయ్యచ్చని తెలుసా..? ఎలా అంటే..?

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. అయితే ఆధార్ ని అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్ ని అప్డేట్ చేసుకోవడానికి పే చెయ్యాల్సి వుంది. అలానే ఆధార్ కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మనం ఫిర్యాదు చెయ్యచ్చు.

ఆధార్ కార్డు కి సంబంధించి సమస్యలు ఉంటే ఎవరికీ కంప్లైంట్ చెయ్యాలో చాలా మందికి తెలియదు. అలానే ఆధార్ ని లాక్ చేసుకోవచ్చు కూడా. అయితే మరి ఆధార్ ని ఎలా లాక్ చెయ్యచ్చు అనేది చూద్దాం. అలానే ఆధార్‌ కార్డును పబ్లిక్‌ కంప్యూటర్ల లో ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్‌ చెయ్యకండి. ఇలా డౌన్‌లోడ్‌ చేస్తే ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆధార్‌ కార్డును కూడా లాక్‌ చెయ్యడం మంచిది.

ఆధార్ ని ఇలా లాక్ చెయ్యండి:

ఎంఆధార్‌ యాప్‌ సహాయంతో ఈ సదుపాయాన్ని పొందొచ్చు.
దీని ద్వారా మీరు బయోమెట్రిక్‌ లాక్‌ చేసుకోవచ్చు.
దీనికి వర్చువల్‌ ఐడీ కావాలి.
16 అంకెల రివోకేవల్‌ నెంబర్‌ ఇది.
ఆధార్‌ నెంబర్‌తో పాటు మ్యాచ్‌ చేస్తారు.
ఆధార్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1947పై ఎస్‌ఎంఎస్‌ ద్వారా పొందొచ్చు.
ఇలా మీరు లాక్‌ చేసుకోవచ్చు.
యూఐడీని లాక్‌ చేయడానికి ఆధార్‌లోని చివరి 4 అంకెలు కానీ 8 అంకెలు టైప్‌ చేసి 1947 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేసి లాక్‌ చేసుకోవచ్చు.
మాస్క్ ఆధార్ కి అయితే కేవలం ఆఖరి నాలుగు నెంబర్లు మాత్రమే కనపడతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news