వచ్చిన ప్రతి పాత్ర చేస్తే నేను కోట్లు సంపాదించే దాన్ని.!

-

ఒకప్పుడు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల పక్కన సినిమాలు చేసిన అను ఇమ్మాన్యుయేల్ చాలా కాలంగా సరైన హిట్స్ పడక , తనకు ఈ మధ్య సినిమాలు తగ్గి పోయాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ తో కలిసి చేసిన ఊర్వశివో రాక్షసివో’  సినిమాతో  ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా లో తన పాత్రకు ప్రశంశలు వస్తున్నాయి.

ఈ సందర్బంగా తన సినిమా కెరీర్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.కొన్ని సినిమాల ఫలితాలు చూశాక నేను కథల ఎంపికలో పద్దతి మార్చుకున్నా. మూస కథలకి దూరంగా ఉంటున్నా. నా దగ్గరకి వచ్చిన పాత్రకి నేను సరిపోతానా?  లేదా? అని ఆలోచించిన మీదట మాత్రమే నేను సినిమాలు  ఒప్పుకుంటున్నా. నాకు తగ్గ పాత్ర కాదని అనిపిస్తే వాటి జోలికి  వెళ్లడం లేదు. ఎంత పారితోషికం ఆఫర్ చేసినా నో చెప్పేస్తున్నా అని చెప్పింది.

అలాగే చెత్త పాత్రలు  పిచ్చి సినిమాలు చేయకూడదని మాత్రం చాలా బలంగా నమ్మాను. నాకు నటించక పోతే గడవని పరిస్థితి లేదు, నా దగ్గరకు వచ్చిన సినిమాలు ఒప్పుకుంటే ఎప్పుడో నేను కోట్లు సంపాదించే దాన్ని ,ఊర్శశివో  రాక్షసివో సినిమా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. ఇందులో సిందు పాత్ర నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గర ఉంటుంది.అలా పాత్రకి నేను బాగా కనెక్ట్ అయ్యా. అందుకే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా అని అను ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news