ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్.. ఎక్కడంటే..?

-

గుజరాత్​లోని ఉనా నియోజకవర్గం బనేజ్​ ప్రాంతానికి చెందిన మహంత్​ హరిదాస్​ బాపు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఎన్నికల్లోనూ ఆ పోలింగ్​ స్టేషన్​కు వస్తారు. ఆ ప్రాంతంలో నివసించేది ఆయన ఒక్కరే అయినందున ఆయన కోసమని ఈసీ అక్కడ ఓ పోలింగ్​ బూత్​ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఎనిమిది మంది అధికారులు, భద్రతా సిబ్బందిని పంపుతుంది.

ఉనా అసెంబ్లీలోని బనేజ్​ పోలింగ్​ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్​ భరత్​దాస్​ బాపు అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసేది ఈసీ. 2019లో ఆయన మరణించిన తర్వాత ఆ పోలింగ్​ బూత్​ను మూసివేయాలనుకున్నారు అధికారులు. అయితే ఆయన వారసుడిగా మహంత్​ హరిదాస్​ మహరాజ్​ రావడం వల్ల తిరిగి ఆ పోలింగ్​ బూత్​ను ప్రారంభించారు. తన కోసం పోలింగ్​ స్టేషన్​ను పునఃప్రారంభించినందుకు హరిదాస్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్​లోని మొత్తం 182 నియోజకవర్గాలకు రెండు దశల్లో(డిసెంబర్ 1న, 5న) పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్​తో కలిపి డిసెంబర్​ 8న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితం వెలువడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news