కేసీఆర్ ప్రెస్ మీట్ లో కొప్పుల ఈశ్వర్ కు ఘోర అవమానం జరిగిందని.. దళితుడని ఆయనను చిన్న చూపుతో కేసీఆర్ చూశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. దీనిపై కొప్పుల ఈశ్వర్ స్పందించారు. తెరాస పార్టీ కుటుంబానికి, తండ్రి లాంటి వారు సిఎం కెసిఆర్ అని మంత్రి కొప్పుల వివరించారు.
గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారు, కానీ ఎమ్మెల్యే వరుసలో ఉన్న నన్ను మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి గారు కోరారని…ఈ విషయంపై బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి గారిని, దళిత సమాజానికి అవమానం జరిగిందని చిత్రికచిస్తున్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులు ఇలాంటివి మానుకోవాలని మంత్రి కొప్పుల కోరారు. అదేవిధంగా పార్టీ అనేది ఒక కుటుంబం ఇందులో ముఖ్యమంత్రి కెసీఆర్ గారు కుటుంబానికి తండ్రి లాంటి వారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేసారు.
ప్రెస్ మీట్ లో గౌరవ ముఖ్యమంత్రి@TSwithKCR మంత్రులుఓవైపు,ఎమ్మెల్యేలుఓవైపు కూర్చోవాలని ఎమ్మెల్యే వరుసలో ఉన్ననన్ను మంత్రుల వైపు రావాలని కెసిఆర్ గారు అన్నారు దీనపై బిజెపి,కాంగ్రెస్ పార్టీల నాయకులు నాకు, దళిత సమాజానికి అవమాని చిత్రీకరించడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను @trspartyonline pic.twitter.com/lUR3jGYRLQ
— KoppulaEshwarTRS (@Koppulaeshwar1) November 4, 2022