పంజాబ్​లో పంట కాల్చివేతపై బాధ్యత మాదే : కేజ్రీవాల్

-

పంజాబ్‌లో పంట వ్యర్ధాల‌ను రైతులు కాల్చివేస్తుండటం వల్ల దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయి కాలుష్యం పెరుగుతోంది. ఈ అంశంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్​సింగ్​ మీడియాతో మాట్లాడారు.

పంజాబ్​లో పంట వ్యర్థాల కాల్చివేతపై నిందారోపణలు అవసరం లేదని.. వాయి కాలుష్యం అనేది ఉత్తర భారత సమస్య అని కేజ్రీవాల్ అన్నారు. రెండు పంటల మధ్య సమయం తక్కువ ఉండటం వల్ల రైతులకు మరో అవకాశం లేకుండా పోతోందని తెలిపారు. పంజాబ్​లో పంటల వ్యర్థాలు కాల్చివేస్తున్నారంటే.. దానికి బాధ్యత తమదేనని కేజ్రీవాల్ అన్నారు.

వ‌చ్చే ఏడాదిలోగా పంట వ్య‌ర్ధాల కాల్చివేత‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేజ్రీవాల్ తెలిపారు. వ‌చ్చే ఏడాదికి కాలుష్యం లేకుండా చూస్తామ‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వానికి కేవ‌లం ఆరు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే వచ్చింద‌ని, ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డంలో మాఫియాలు అడ్డువ‌స్తున్నాయ‌ని, కానీ వ‌చ్చే ఏడాదిలోగా దీనిపై స‌మ‌గ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news