ఓటిటిలో ఫ్రీగా “పొన్నియిన్ సెల్వన్ 1” రిలీజ్..ఎందులో అంటే !

-

త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆదరించిన చిత్రం పొన్నియన్ సెల్వ‌న్‌-1. లెజెండరీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ న‌వ‌ల ఆధారంగా మ‌ణిర‌త్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ మూవీ.. మంచి విజయాన్ని అందుకుంది.

మరి భారీ వసూళ్లలో తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం అయితే మిగతా భాషల్లో మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే రాణించలేదు. తమిళ్ వెర్షన్ వరకు అయితే భారీ హిట్ అయినటువంటి ఈ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా, ఈ చిత్రం తమిళ్, తెలుగు సహా ఇతర భాషల్లో గత కొన్ని రోజుల క్రితం రెంటల్ గా స్ట్రీమింగ్ కి రాగా ఈరోజు నుంచి అయితే ఫ్రీగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ చిత్రంని అయితే అప్పుడు మిస్ అయిన వారు ఇప్పుడు చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news