వాట్ ఎ టాలెంట్ భయ్యా..చాక్‌పీస్‌ తో అద్బుతాలు..

-

ప్రతి మనిషికి ఏదొక టాలెంట్ఉంటుంది.. అయితే కొంతమంది సమయం కోసం ఎదురుచూస్తారు..మరి కొంతమంది మాత్రం ఎలాగైనా ఫెమస్ అవ్వాలని విస్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అద్భుతాలు సృష్టించే వాళ్లు కొందరే ఉంటారు. అరచేత్తో అద్భుతమైన చిత్రాలు వేసే కళాకారులు అరుదుగా ఉంటారు..కొందరు బ్రష్,పెన్సిల్ తో  అదరహో అనిపించే బొమ్మలు వేస్తున్నారు..ఇప్పుడు ఓ అమ్మాయి మాత్రం చాక్‌పీస్‌ తో అద్బుతాలను సృష్టిస్తుంది.. నిజంగా అలాంటి ఆలోచన రావడం గ్రేట్..

బోర్డుపై చాక్‌ పీస్‌తో పాఠాలు చెప్పడం, లేదంటే లెక్కలు చేయడం చూశాం. కాని ఇప్పుడు ఓ అమ్మాయి చాక్ పీస్‌తో వేసిన బొమ్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఏర్పడ్డారు. చాక్‌పీస్‌తో వేసిన బొమ్మే కదా అని కొట్టిపారేసే వాళ్లకు వీడియో చూస్తే ఆమెకు వీరాభిమానులు అయిపోతారు. ఒకే ఒక్క చాప్‌ పీస్‌తో ఇంతటి అద్భుతమైన కళాఖండాన్ని బోర్డుపై ఆవిష్కృతం చేయవచ్చా అనే సందేహాలు ఇప్పుడు ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. అందుకే ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

చాక్‌ పీస్‌తో ఓ అందమైన బొమ్మకు ప్రాణం పోసింది. చాక్‌పీస్‌ను నిలువుగా కాకుండా అడ్డంగా పట్టుకొని బోర్డుపై గీసింది. వీడియో మొదట్లో చూస్తే ఇదేదో సాధారణ పెయింటింగ్ అని అనిపిస్తుంది. కానీ.. పూర్తిగా గీసిన తర్వాత చూస్తే వర్షంలో గొడుగు పట్టుకుని ఉన్న యువతి, యువకుడు బొమ్మలుగా మారిపోవడం కనిపిస్తుంది..ఆ వీడియోను చూసేవరకు ఎవ్వరూ నమ్మరు..ఆ పెయింటింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ యువతి ప్రతిభ.. అమోఘం.. అంటూ కొందరు.. ఇది మేము నమ్మలేకున్నాం.. అద్భుతం.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు..ఆ వీడియోను మీరు చూసి ఓ లైకు వేసుకొండి..

Read more RELATED
Recommended to you

Latest news