చాలా మంది భవిష్యత్ లో ఇబ్బందులు రాకూడదని ముందే సేవ్ చేస్తూ వుంటారు. అందుకోసం స్కీమ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయనేది మనం ఊహించలేము. అందుకని డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఇక మహిళలు ఎలా డబ్బులని సేవ్ చేసుకోవాలి..?, భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది చూద్దాం.
మహిళలు భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గోల్డ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లాంటి వాటిలో పెడితే బాగుంటుంది. దీని వలన భవిష్యత్ లో సమస్యలు వుండవు. ఎక్కువ మంది ఎక్కువగా బ్యాంకుల్లో డబ్బులని పెట్టి FD చేస్తుంటారు. ఇతర వాటిలో కూడా డబ్బులు పెట్టచ్చు. దీనితో కూడా లాభాలు బాగానే ఉంటాయి. గోల్డ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ తో పాటుగా కావాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా సరే డబ్బులు పెట్టవచ్చు. కానీ రిస్క్ ఉంటుంది.
రిస్క్ తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. కావాలంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకోవోఅచ్చు. ఇందులో మల్టీపుల్ అసెట్ కేటగిరిలు ఉంటాయి. కనుక దీనిలో కూడా డబ్బులు దాచుకోవచ్చు. ఇలా మహిళలు డబ్బులని పెట్టి భవిష్యత్తు లో ఇబ్బందులు ఏమి లేకుండా హాయిగా ఉండచ్చు.