గాంధీ హాస్పిటల్ వివాదం.. బీఆర్ఎస్ వైద్య కమిటీ సభ్యుల గృహనిర్భంధం

-

గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న మాతాశిశు మరణాల విషయమై అధ్యయనం కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వైద్య కమిటీ సభ్యులు ఆస్పత్రికి వెళ్లకముందే పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం జరిపి, ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు గులాబీ పార్టీ ఏర్పాటు చేసిన ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని కాంగ్రెస్ సర్కార్ అడ్డుకుంటుందని ఆరోపించింది.

కమిటీ అధ్యక్షుడు,మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇండ్ల వద్దకు పోలీసులు చేరుకున్నారని ప్రకటించింది.ముగ్గురు నేతల అరెస్టుకు పోలీసుల ప్రయత్నించారని పేర్కొంది. ఆస్పత్రుల సందర్శనకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది.గాంధీలో మాతా శిశు మరణాల వివరాలను ప్రభుత్వం దాస్తోందా? లేదా తమ వైఫల్యం బయటకు రాకుండా కప్పిపుచ్చుతుందా? అని అడిగారు.కాగా, గాంధీలో ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news