సౌత్ సినిమాలపై అలాంటి వ్యాఖ్యలు చేసిన రకుల్..!!

-

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. మొదట కెరటం సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు నటిస్తూ అక్కడ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఈమెకు అక్కడ ఒక్క సినిమా కూడా సక్సెస్ అందుకోలేదని వార్తలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సౌత్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రకుల్ ప్రీతిసింగ్ వాటి గురించి తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు చాలావరకు అన్ని భాషలలో సత్తా చాటుతున్నాయి.ఈ లెక్కన చూస్తే నార్త్ సినిమాల కన్నా సౌత్ సినిమాలకే కలెక్షన్ల పరంగా మంచి వసూలు రాబడుతున్నాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై చాలామందికి నమ్మకం పోతోందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ హీరోలకు బాలీవుడ్ హీరోలకు మధ్య ఒక గట్టి కోల్డ్ వార్ జరుగుతోందని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రకుల్ సౌత్ నార్త్ సినిమాలపై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి..

వాటికి సమాధానం తెలియజేస్తూ నేను ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను చంపేస్తున్నాయి అనే వార్తలు విన్నాను…సౌత్ సినిమాల వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీపై నమ్మకం పోయింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి సౌత్ సినిమాల ప్రాణం పోయాలంటూ వినిపిస్తున్న వార్తలని ఖండిస్తున్నానని తెలియజేసింది. ఎందుచేత అంటే సినిమా అనేది ఎక్కడైనా సినిమానే అది నార్త్ అయినా సౌత్ అయినా సరే సినిమాలో మంచి కథ, టాలెంట్ ఉంటే కచ్చితంగా ఏ చిత్రమైన సక్సెస్ అవుతుందని తెలియజేసింది. కొన్నిసార్లు ఏ ఇండస్ట్రీలో నైనా పరాజయలు రావచ్చు.. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళీ ఇండస్ట్రీ పుంజుకుంటుందని తెలియజేసింది. అయితే ప్రస్తుతం రకుల్ ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఆమెపై సౌత్ ప్రేక్షకులు చాలా కోపంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news