ఏపిలో 151 సీట్లు వచ్చిన జగన్ గారిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శలు చేశారు అలీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప్రముఖ సినీ నటులు మహమ్మద్ అలీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సినీ నటులు మహమ్మద్ అలీ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నాకు తెలిసి అ ఆరోపణలు కరెక్ట్ కాదు. ప్రజల ఆదరణ పొందిన పార్టీ వైఎస్ఆర్ సీపీ. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ప్రజలు ఊరకనే తీసుకొచ్చి చేతిలో పెట్టేయలేదు. మీ పాలన బాగుంటుంది. అద్భుతం అవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని నమ్మారు. విశాఖపట్నం కావచ్చు, రాయలసీమ కావచ్చు, అన్నిచోట్ల అభివృద్ధి జరుగుతోంది.
మొన్న ఉత్తరాంధ్ర షూటింగ్ కు వెళ్లాం. ఆ బీచ్ లు కానీ, రోడ్లు కానీ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో డెవలప్మెంట్ లేని రోజుల్లో కూడా షూటింగ్ లు జరిగాయి. ఇప్పుడు డెవలప్ చేస్తే తెలుగు సినిమాలే కాదు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఫిలిమ్స్ మన దగ్గరికి వస్తాయి. మనం వెళ్లి అక్కడ చేసుకుంటున్నాం, వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటే మనకు ఉపాధి దొరుకుతుంది” అని ఆలీ చెప్పుకొచ్చారు.
ఏపిలో 151 సీట్లు వచ్చిన జగన్ గారిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు ఉందా అంటున్న ఆలీ…👌👌 pic.twitter.com/9eyOQr2yJD
— Anitha Reddy (@Anithareddyatp) November 7, 2022